Peddireddy Ramachandra Reddy: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వెంకటే గౌడ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.. నామినేషన్ అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలమనేరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరోసారి ఎగురుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మన అభ్యర్ధిపై విమర్శలు చేశారు.. ఊరు, పేరు లేని వారు నాపైన గెలువగలరా? అని ఎద్దేవా చేశారు.. కానీ, అదే ఊరు, పేరు లేదు అని విమర్శలు ఎదురుకున్న వెంకటే గౌడ 33 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారని వెల్లడించారు.. అప్పటికి మన ప్రభుత్వం లేదు, అయినా భారీ మెజారిటీతో గెలిచాం.. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్ని అభివృద్ధి పనులు చేసి, ఇన్ని సంక్షేమ పథకాలు అందించాం.. ఈ నేపథ్యంలో మనం గతం కంటే రెట్టింపు మెజారిటీతో గెలవాలి.. కనీసం 66 వేల ఓట్ల మెజారిటీతో ఈసారి పలమనేరులో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: Sreeleela : కాలేజీ కుర్రాళ్ళతో కలిసి’ కుర్చీని మడత పెట్టి’ న శ్రీలీల..