Nandamuri Balakrishna Bus Yatra: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అన్ని పార్టీల అగ్రనాయకత్వం ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగింది.. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగనున్నారు.. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు బాలయ్య.. రేపటి నుంచి బాలకృష్ణ రాష్ట్ర పర్యటన ప్రారంభం అవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెల్లడించారు.. ఇక, బాలయ్య యాత్ర కోసం ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు.. ”స్వర్ణాంధ్ర సాకార యాత్ర” పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.. రేపు ఉదయం 9 గంటలకు కదిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న బాలయ్య.. ఆ తర్వాత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాలలో బాలయ్య పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు.. ఆ తర్వాత మరిన్ని జిల్లాలకు విస్తరిస్తారా? అనేది వేచిచూడాలి.
Read Also: BRS: కడియంకు చెక్ పెట్టేందుకేనా?.. వరంగల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య!
ఇక, బాలయ్య బస్సు యాత్ర కోసం ఓ బస్సుకు ప్రత్యేకంగా తీర్చి దిద్దారు.. బస్సుకు పూర్తిగా పసుపు కలర్ అద్దారు.. బస్సు ముందు పై భాగంలో ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ అని రాశారు.. ఆ తర్వాత మిర్రర్‌కు సైకిల్ గుర్తు దానికి కింద తెలుగుదేశం పార్టీ అని ఓ స్టిక్కర్ అంటించారు.. ఆ తర్వాత బాలయ్య అన్‌స్టాపబుల్ అని రాసుకొచ్చారు.. ఇక, కింద తెలుగుదేశం పిలుస్తోంది రా..! కదలిరా..! అనే అక్షరాలను పొందుపరిచారు.. మరోవైపు.. బస్సుకు ఇరువైపులా స్వర్గీయ ఎన్టీఆర్ ఫొటో.. బీజేపీ-టీడీపీ-జనసేన సింబల్స్ .. ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఫొటోలతో పాటు.. పెద్ద సైజ్‌లో బాలయ్య ఫొటోను ముద్రించారు.. మరోవైపు వెనక భాగంలోనూ వీటికే చోటు కల్పించారు.. మొత్తంగా ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ ప్రచార రథం సిద్ధమైంది.. ఈ బస్సును కర్ణాటకలో రిజిస్ట్రేషన్ చేయించారు.. KA 53 TC 2401 నంబర్‌ను కేటాయించారు. మరోసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న బాలయ్య.. తన నియోజకవర్గంతో పాటు రాయలసీమ జిల్లాలపై ఫోకస్ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.


