ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరువూరు పట్టణంలోని 17వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. స్వచ్చందంగా వైస్సార్‌సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో యాంకర్ శ్యామల ఈ రోజు 51వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేశినేత శ్వేత తెలిపారు.
కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉండి భారతీయ జనతా పార్టీలోకి చేరాల్సిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీఆర్ఎస్ అసత్య ప్రసారం చేస్తుంది.. ఎన్నికల్లో ఓట్లు సాధించడం కోసమే ఈ దుష్ప్రచారం అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
గుంటూరు గొంతు ఎండకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉందని.. ఏడాదిలోపు నిధులు సేకరించి పనులు ప్రారంభిస్తామని.. గుంటూరు ప్రజలకు నీళ్లు అందిస్తామని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గుంటూరు నగరంలో భాగమైన గోరంట్లలో కొన్నేళ్లుగా ఆగిపోయిన రిజర్వాయర్ నిర్మాణాలను తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులైన నసీర్ అహ్మద్, పిడుగురాళ్ల మాధవి, బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని శనివారం పరిశీలించారు.