ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఓ వైపు కూటమి, మరో వైపు వైసీపీ అగ్రనేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం ముమ్మరం చేయనున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకొనేందుకు ఈ నెల 7,8 తేదీల్లో మరో అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా ప్రకటించారు. ఆయన ఆదివారం విజయనగరంలో పర్యటించారు.
సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని.. ఎపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. "ఎపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం.
తాను ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల లోనే పుట్టానని.. తనతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ.. "నేను వస్తున్నానని తెలిసి, హెలికాప్టర్ రాకుండా హెలిపాడ్ తవ్వి వేశారు.
మోసాలు చేసేందుకు దోచుకునేందుకు కూటమి సిద్ధంగా ఉందని.. వారి మాటలను నమ్మే మోసపోవద్దని రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గిరిజనులకు పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా అరకులోయలో వైసీపీ నిర్వహించిన రోడ్ షోకు ఆయన పాల్గొని మాట్లాడారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముఖ్య ఉద్దేశం ఏంటని ఢిల్లీలో మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని.. ఏపీలో గూండా గిరి, నేరస్తులను అరికట్టడానికే పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో అవినీతిని అంతమొందించేందుకు పొత్తు పెట్టుకున్నాం.. ఏపీలో భూకబ్జాలు అడ్డుకోవడానికి పొత్తు పెట్టుకున్నాం అని వెల్లడించారు. మరోవైపు.. ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.. ఏపీ రాజధానిగా అమరావతిని చేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా
ఇంకా అమలులోకి రాని చట్టాన్ని చంద్రబాబు రద్దు చేస్తాడట అని ఎద్దేవా చేశారు వేణుగోపాలకృష్ణ... తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడన్న ఆయన.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీతో చెప్పించగలరా ..? అని సవాల్ విసిరారు.