ఏపీ క్యాబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించి చర్చ జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చడం అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్యాబినెట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు ఆయన్ను ఓదార్చారు. క్యాబినెట్‌లో 24 అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి మారుస్తున్నాం అని, రాజంపేటను కడప జిల్లాలోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. క్యాబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో కలిసి అనగాని మీడియాకు…