అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాటి ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ప్రేమోన్మాది గణేష్‌ను అరెస్ట్ చేశారు పోలిసులు. నిందితుడు గణేష్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.
ప్రేమికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు ప్రియుడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.. జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23) పై మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు.
రియల్ ఎస్టేట్‌లో నష్టాలు రావడంతో ఓ వడ్డీ వ్యాపారి 20 కోట్ల రూపాయలకు పైగా టోకరా పెట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఈ ఘటన కలకలం రేపుతుంది. వడ్డీ వ్యాపారిగా ఉన్న కూర్మదాసు హేమంత్.. కొత్తపేట మెయిన్ రోడ్ లో సత్య సూర్య బ్యాంకర్స్ ను ప్రారంభించి ఇందులో పార్టనర్ గా ఉన్నారు.. అయితే హేమంత్ తాకట్టు వడ్డీ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా మరొకరితో భాగస్వామ్యగా ఉన్నారు.
తన కూతురు ప్రేమ వివాహానికి సహకరించిన వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయడానికి ప్లాన్ చేశాడో ఓ వ్యక్తి.. కోడి కత్తులతో పొడిచి హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు.. అయితే, హత్య చేసేందుకు రెక్కి చేస్తుండగా నిందితులను అనుమానం వచ్చి పోలీసులు పట్టుకున్నారు.. ఈ కేసు వివరాలను నందిగామ ఏసీపీ తిలక్ మీడియాకు వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో.. ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్న బాలుడిపై కత్తితో దాడికి దిగాడు సదరు బాలిక తండ్రి.. ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు బాలుడు.. ఎదురుగా ఉన్న బాలికల పాఠశాలలో టెన్త్ చదువుతోంది బాలిక.
అనంతపురంలో డిజిటల్ అరెస్టు పేరున డబ్బు డిమాండ్ చేసిన సైబర్ కేటుగాడిని రిటైర్డ్ ఉద్యోగి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఫోన్ చేసింది డిజిటల్ మోసగాడు అని గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగి నారాయణ రెడ్డి నేరుగా అనంతపురం టు టౌన్ పోలీసులను ఆశ్రయించారు.. దీంతో డిజిటల్ నెరస్తుడి నుంచి తప్పించుకున్నాడు. ధైర్యంగా ఎదుర్కొన్న నారాయణ రెడ్డిని అనంతపురం టు టౌన్ సీఐ శ్రీకాంత్, సైబర్ క్రైం సీఐ జాకీర్ లు అభినందించారు.
గుడివాడలోని రైలుపేటలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి సమీపంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్న ఎండూరి జోజి బాబు (45) చిన్నారిపై దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైలుపేటలోని బాలిక ఇంటి వద్ద గుడివాడ డీఎస్పీ అబ్దుల్ సుబాన్ స్వయంగా విచారణ…