కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో ఈ నెల 20వ తేదీన ఇరువురు వ్యక్తుల మధ్య రూ.300 విషయమై ఘర్షణ జరిగింది.. అదికాస్తా దాడికి దారిసింతి.. చాట్ల సతీష్ (27) పై కర్రతో దాడి చేశాడు వెంకటేశ్వరావు అనే వ్యక్తి.. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలయ్యారు చాట్ల సతీష్.. దీంతో, అతడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సతీష్ మృతి చెందాడు.
సోషల్ మీడియా వేదికగా ఎన్నో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. మనకు తెలిసి వ్యక్తి.. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా? అది అసలు ఖాతానేనా..? ఇంకా ఎవరైనా ఆ పేరుతో ఖాతా ఓపెన్ చేశారా? అనేది కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడిదంతా ఎందుకంటే.. చెల్లి పేరుతో ఫేస్‌బుక్ ఖాతాను ఓపెన్ చేసిన ఓ అక్క.. ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది.. అంతేకాదు.. అతడి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసింది.. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆత్మహత్యాయత్నం…
ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండల సర్వేయర్ చిక్కాల ధర్మారావు ఏసీబీ ట్రాప్‌కు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖకు చెందిన బృందం దాడి చేసింది. ఎలకొలను గ్రామానికి చెందిన బి.రాముడు నుంచి లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ చిక్కాల ధర్మారావు.
ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. నెలల వయసున్న చిన్నారి నుంచి వృద్ధుల వరకు వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా దుర్మార్గులు అకృత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది.
దేశంలో కరడుగట్టిన కేడీ గాళ్లను కటకటాల పాలు చేసిన పోలీసులు ఉన్నారు.. బడా చోర్‌ల ఆటకట్టించిన ఖాకీలు కూడా ఉన్నారు. అంతేకాదు దొంగలతో కలిసి వాటాలు పంచుకున్న ఖాకీలు కూడా ఉన్నారండోయ్.. అది కూడా పోలీస్ స్టేషన్‌లోనే సెటిల్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. కేసు మాఫీ కోసం ఏకంగా స్టేషన్‌లో పోలీసులు వాటాలు పంచుకున్నారు. వివరాల ప్రకారం… తణుకు మండలం వేల్పూర్‌లో ఆకుల…
కర్నూలు జిల్లా కోసిగి మండలం కడదొడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు అత్యాచార యత్నం చేశారు. బాలిక తాత కేకలు వేయడంతో సర్పంచ్ హుసేని అక్కడి నుంచి పరారయ్యాడు.
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియంలో వివాహిత అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన నర్సరీ మహిళా కూలీ రౌతు కస్తూరి.. గత నెల 15న చొప్పెల్ల లాకుల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే, ఆమె పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తేలింది.
రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరాగాళ్ల ఉచ్చులో చిచ్చుకునే ప్రమాదం ఉంది. తాజాగా భీమవరంకు చెందిన ఓ వ్యక్తికి ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరించి రూ. 73 లక్షలను సైబర్ కేటుగాళ్లు కాజేశారు.
ఈ ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన బాపట్లలలో చోటుచేసుకుంది.