Acid Attack Case: అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాటి ఘటన కలకలం సృష్టించింది.. అయితే, ప్రేమోన్మాది గణేష్‌ను అరెస్ట్ చేశారు పోలిసులు. నిందితుడు గణేష్ ను మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు… ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు గణేష్ ను అరెస్టు చేశామని.. పక్కా పధకం ప్రకారమే గౌతమిపై గణేష్ దాడికి పాల్పడ్డినట్లు తెలిపారు ఎస్పీ.. దాడి చేయాలని ఉద్దేశంతోనే ముందు రోజే బాత్ రూమ్‌లు శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ కొనుగోలు చేశాడు.. ఇక, మరుసటి రోజు తెల్లవారుజామునే బాధితురాలి ఇంటికి వెళ్లి.. ఒంటరిగా ఉన్న సమయం కోచి వేచిచూశాడని.. ఆ తర్వాత కత్తితో దాడి చేసి తర్వాత తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను గౌతమి నోట్లో పోసి, తాగించేందుకు ప్రయత్నించాడన్నారు. అసమయంలో గౌతమి కొంతవరకు ధైర్యంగా ప్రతిఘటించిందన్నారు..
Read Also: CM Revanth Reddy: త్వరలో సూర్యాపేట, గద్వాల్లో భారీ బహిరంగ సభలు..
ఇక, గణేష్, గౌతమి ఇద్దరూ డిగ్రీలో స్నేహితులని వెల్లడించారు జిల్లా ఎస్పీ.. అయితే, తనను ప్రేమించాలంటూ తన వెంట పడుతోన్న గణేష్‌ను తొలి నుంచి సదరు యువతి దూరం పెడుతూ వచ్చింది.. ప్రేమించాలని ఒత్తిడి తెచ్చినా.. నిరాకరించింది.. అయితే గౌతమికి వివాహం ఖాయమైందని తెలిసే ఈ దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు.. ఇక, పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేస్తామన్నారు ఎస్పీ.. మహిళలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించబోమని వార్నింగ్ ఇచ్చారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు..