నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో కట్టుకున్న భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు ఓ కసాయి మొగుడు. మద్యం మత్తులో భార్య సుగుణమ్మ (48) ను కిరాతకంగా గొడ్డలితో హత్య చేశాడు భర్త వడ్డే రమణ.
ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి హైస్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్లేందుకు స్కూల్‌కు వచ్చిన బాలికను తోటి విద్యార్థి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు
మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు.