Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళి ఏపీఎఫ్ డిసి చైర్మైన్ గా నేడు బాధ్యతలు తీసుకున్నారు. గతేడాది ఏపీ సీఎం జగన్ ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసానిని నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక ఆ పదవి బాధ్యతలను నేడు పోసాని చేపట్టారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఆయన పదవి బాధ్యతలు అందుకున్నారు. ఇక అక్కడ ఉద్యోగులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. తనను నమ్మి ఈ పదవిని అందించినందుకు పోసాని, జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీగా పని చేస్తానని, జగన్ నమ్మి ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని పోసాని చెప్పుకొచ్చారు.
Nijam With Smitha: టాలీవుడ్ చీకటి కోణాన్ని స్మిత నిర్భయంగా బయటపెడుతుందట..?
ఇక పోసాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు చేశారు.. చేస్తున్నారు. రాజకీయపరంగా చూసుకొంటే.. మొదట్లో పోసాని ప్రజారాజ్యం తరుపున పోటీ కూడా చేశాడు. అక్కడ ఓడిపోయాక.. వైసీపీలో చేరాడు. అప్పటినుంచి జగన్ కు మద్దతుగా నిలబడ్డాడు. ఎన్నో ఏళ్ళు పదవి కోసం ఎదురుచూస్తున్న వారిలో పోసాని కూడా అవకారు. ఇక ఎట్టకేలకు గతేడాది పోసాని కోరికను జగన్ నెరవేర్చారు. ముందు ముందు ఈ పదవిలో ఉన్న పోసాని ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటాడో చూడాలి.