డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ కమిషనర్ కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి నామినేటెడ్ పదవులిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా జాప్యం చేయకుండా నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.