AP CID to Move Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.. ఈ సమయంలో కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది.. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సీఐడీ లీగల్ టీమ్ ఢిల్లీకి చేరుకుంది.. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిట్ మంజూరు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది ఏపీ…
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. మొత్తం 12మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
చంద్రబాబు పై మరో కేసు నమోదు అయింది.. ఉచిత ఇసుక విధానం పేరిట గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ నేపథ్యంలో మరికొన్ని షరతులు విధించాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఎల్లుండి(నవంబర్ 3)కి వాయిదా వేసింది.
హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు తుంగలో తొక్కారు అని సీఐడీ అధికారులు అంటున్నారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఏపీ సీఐడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఆయనపై హైకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఏపీ సీఐడీ రెడీ అయినట్లు టాక్.
చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కొత్త కేసు నమోదు చేసింది సీఐడీ. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఉదయం 10 గంటలకు సీఐడీ ఆఫీస్ లో విచారణకు హాజరుకానున్నారు. IRR allignment మార్పు కేసులో లోకేశ్ ను A14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో ఫైల్ చేశారు.
ఈ కేసును మంగళవారం రోజున సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక తాజాగా చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను విచారించే బెంచ్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చింది. ఈ బెంచ్ లో జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలు ఉన్నట్లు తెలుస్తుంది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ ఢిల్లీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షసాధింపు కోసం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు అని తెలిపారు. బాబు రిమాండ్ కు వెళ్ళే ముందు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడాలి అన్నారు.