AP Fiber Grid Case: ఫైబర్ గ్రిడ్ కేసులో సీఐడీ దూకుడు.. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కి నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Fiber Grid Case: ఫైబర్ గ్రిడ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు దూకుడు చూపిస్తున్నారు.. ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల అటాచ్‌మెంట్ చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు.. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలంటూ.. హోంశాఖు ప్రతిపాదనలు పంపగా.. సీఐడీ అధికారుల ప్రతిపాదనకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. దీంతో, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో అనుమతి కోసం ఈ రోజు సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.. టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు ఆస్తులకు అటాచ్ మెంట్ కు నిర్ణయం తీసుకున్న సీఐడీ అధికారులు.. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర హోంశాఖకు పంపి ఆమోదింప జేసుకుంది.. దీంతో.. ఈ కేసులో మరింత దూకుడు చూపించినట్టు అవుతుంది..
Also Read: Bigg Boss 7 Telugu: తేజ వల్ల భాధపడిన శోభా..టాస్క్ లో పోటాపోటీగా ఆడిన రెండు టీమ్స్..
Also Read
- Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
- Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
ఇక, సీఐడీ అధికారులు అటాచ్‌మెంట్‌కు సిద్ధమైన ఆస్తులను ఓ సారి పరిశీలిస్తే.. గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో 4 ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి.. తదితర ఆస్తుల అటాచ్‌మెంట్‌కు హోంశాఖ ఉత్తర్వుల జారీ చేసిన నేపథ్యంలో.. ఆ స్థిరాస్తులను అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. మరి సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.. కాగా, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అరెస్ట్ అయిని.. 53 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ మధ్యే విడుదల అయిన విషయం తెలిసిందే కాగా.. ఫైబర్ గ్రిడ్ కేసులోనూ చంద్రబాబు పేరును సీఐడీ అధికారులు చేర్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Virat Kohli-Rohit Sharma: బరిలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. సెప్టెంబర్ 27 నుంచే సమరం..
-
Amaravati: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు ఫౌండేషన్
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
-
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
-
Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!