చంద్రబాబు పై మరో కేసు నమోదు అయింది.. ఉచిత ఇసుక విధానం పేరిట గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు మరికొందరు ఉన్నారు. ఇష్టాను సారంగా ఇసుక విధానాన్ని మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారు.. తద్వారా ప్రభుత్వానికి నష్టం కలిగించారని సీఐడీకి డీఎంజీ వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు.
Read Also: VarunLuv: అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమైనవాడే మిస్ అయ్యాడేంటి.. ?
అయితే, ఫిర్యాదులో పొందుపరిచిన అంశాలు ఇవే..!
గనులు ఖనిజాలకు సంబంధించి 1957లోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది..
గనులు, ఖనిజాలకు సంబంధించి రెగ్యులేటింగ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వమే..
1957 చట్టం నాటి నియమ నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ లీజులను మంజూరుచేయాల్సి ఉంటుంది..
ఒకవేళ అలాంటి గనులను, ఖనిజాలను నోటిఫై చేయకపోతే వాటిమీద పూర్తి నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానిదే..
2014 నుంచి ఇసుక లీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలోని నియమాలను, నిబంధనలను ఉల్లంఘించింది..
ఆగస్టు 28, 2014న ఇసుక రీచ్‌లన్నింటినీ APMDCకి అప్పగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది..
తర్వాత ఈ రీచ్‌లను జిల్లా, మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు..
2016లో ఈ విధానాన్ని సమీక్ష చేసి కేబినెట్ సబ్ కమిటీకి అప్పగించారు..
కేబినెట్ సబ్‌కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని జనవరి 15, 2016లో మరొక జీవో జారీ చేశారు..
టెండర్ కం ఇ-ఆక్షన్ నిర్వహించాలని జీవోలో పేర్కొన్నారు..
అనూహ్యంగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే దీన్ని కూడా పక్కన పెట్టారు..
ఉచితంగా ఇసుక అంటూ మార్చి 4, 2016 ఒక మెమో జారీ చేశారు..
దీనికి అనుగుణంగా ఏప్రిల్ 6, 2016న జీవో 43 జారీ చేశారు..
ఉచిత ఇసుక విధానానికి సంబంధించి న్యాయ సమ్మతం లేకుండా, కసరత్తు లేకుండా ఈ ఉత్తర్వులు జారీ చేశారు..
ఇసుక పాలసీ విషయంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్న రెండునెలల వ్యవధిలోనే మళ్లీ ఈనిర్ణయం తీసుకున్నారు..
ఒక విధానం పాటించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు..
టెండర్, ఇ-ఆక్షన్ ద్వారా ఇవ్వాలన్న కేబినెట్ నిర్ణయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు..
ఉచిత ఇసుక విధానానికి తగిన కారణాలను కూడా చెప్పలేదు అని ఫిర్యాదులో పేర్కొన్నారు..
Read Also: RGV Vyuham: అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు అంటున్న రామ్ గోపాల్ వర్మ
ఎంత తవ్వుతారు? ఎంత ఇస్తున్నారు?.. ఇందులో ఎలాంటి పద్ధతి అనుసరిస్తున్నారు?.. అన్న దానిపై ఎలాంటి నిర్ణయాలు లేవు.. ఉచిత ఇసుక నిర్ణయానికి కేబినెట్ నోట్ కాని, మెమోరాండం కానీ లేవు.. బిజినెస్ రూల్స్‌ను పాటించలేదు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేర ఆర్థిక నష్టం కలుగుతుందన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్చా జరగలేదు.. దురుద్దేశంతో జీవో జారీ చేశారు.. ఉచిత ఇసుక పేరిట రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని హైకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది.. ఉచిత ఇసుక పేరిట సహజ వనరులను దోచుకున్నారు.. ప్రైవేటు వ్యక్తులు ఉచిత ఇసుక విధానం పేరుతో దోపిడీకి పాల్పడ్డారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది.
Read Also: Pakistan: పాకిస్తాన్ వదిలిపోతున్న ఆఫ్ఘాన్ ప్రజలు.. బహిష్కరణకు కారణాలేంటి..?
అయితే, పేదలకు ఉపయోగపడాల్సింది పోయి కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి ఉచిత ఇసుక విధానాన్ని రూపొందించినట్టుగా పేర్కొంది.. 2016-2019 మధ్య దాదాపు వేయికి పైగా అక్రమ ఇసుక కేసులు నమోదయ్యాయి.. కొండంత అక్రమాల్లో ఇది గోరంత మాత్రమే.. ప్రజలకు ఉచిత ఇసుక అని చెప్పారు.. రీచ్‌లన్నీ ఎమ్మెల్యేలు, అప్పటి అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు చేతుల్లో నడిచాయి.. భారీ యంత్రాలను పెట్టి ఇసుకను నిలువునా దోచుకున్నారు.. ఉచిత ఇసుక విధానం నీడన ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూర్చారు.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని సీఐడీ అధికారులకు డీఎంజీ వెంకటరెడ్డి కోరారు.