ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టై అయ్యారు. గత 53 రోజులుగా రాజమండ్రి సెట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబుకి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు అనగా నవంబర్ 24వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని.. ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
Read Also: Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది
అయితే, బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏపీ హైకోర్టు పలు కండిషన్లు జారీ చేసింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేశామనింది. చంద్రబాబు కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని కోర్టు పేర్కొనింది. హస్పటల్, ఇంటికి మాత్రమే చంద్రబాబు పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది. ఇక, ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుందని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు.
Read Also: VarunLav: హల్దీ వేడుక.. హైలైట్ అంటే మెగాస్టారే..
కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నిబంధనలకు విరుద్దంగా జైలు గేటు వరకు టీడీపీ కార్యకర్తలు తోసుకు వొచ్చి స్వాగతం పలికారు. అయితే, ర్యాలీగా రాకూడదని న్యాయస్థానం షరతులు పెట్టినప్పటికి టీడీపీ శ్రేణుల సమూహంతో చంద్రబాబు రోడ్డుపైకి వచ్చారు. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు.. ఇక, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు తుంగలో తొక్కారు అని సీఐడీ అధికారులు అంటున్నారు. దీంతో ఆయన మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఏపీ సీఐడీ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఆయనపై హైకోర్టులో ఫిర్యాదు చేసేందుకు ఏపీ సీఐడీ రెడీ అయినట్లు టాక్.