టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. తన సర్వీసు రికార్డు లేకుండానే అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశామన్నారు. అశోక్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేశారని సీఐడీ అధికారులు ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో…