మూడేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతున్నాం.. ఇప్పుడు పార్టీ కోసం పని చేస్తున్న వారెవ్వరినీ జగన్ 2.0లో మర్చిపోం.. పక్కాగా డేటా బేస్ తయారు చేయమని మన లీగల్ విభాగం ప్రతినిధులకు చెబుతున్నాను.. ఆ డేటా బేస్ ఆధారంగా వారందరికీ తగిన గుర్తింపు ఇస్తాం అన్నారు వైఎస్ జగన్..
ఏపీ రాజధాని అమరావతిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైయస్సార్‌సీపీ లీగల్‌సెల్ న్యాయవాదులతో సమావేశమైన ఆయన.. అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోందని ఆరోపించారు.. చదరపు అడుగకు 4 వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి.. అమరావతిలో చదరపు అడుగుకు 10 వేలు ఖర్చు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుండి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులతో కూడిన బృందం నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులతో పాటు, అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం, పోర్టులు, సాంకేతిక, మౌళిక రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహకారం కోరనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
రాజధాని విస్తరణకోసం రెండో విడత గ్రామసభలో అధికారులకు నిరసన సెగ తాకింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అధికారుల ఎదుట నిరసనకు దిగారు స్థానికులు.. గ్రామ సభ నిర్వహించడానికి వీల్లేదంటూ పొన్నెకల్లులో రైతులు ఆందోళనకు దిగారు..
అమరావతి అభివృద్ది విషయంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ).. ఎపీ సీఆర్‌డీఏ విజ న్ 2047 పేరుతో ఆన్‌లైన్‌లో ప్రశ్నావళి రూపొందించింది సీఆర్డీఏ..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రాజధాని అమరావతిలో చేపడుతున్న మలివిడత భూ సమీకరణపై మంత్రివర్గంలో చర్చించారు.. అయితే, తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలివిడత భూ సమీకరణకు వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది... సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.. సమావేశానికి మంత్రులు నారాయణ, భరత్, అధికారులు హాజరయ్యారు..
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు నేడు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. కోర్టుకు సెలవులు కావడంతో గుంటూరు జిల్లా జైలులోనే కొమ్మినేని ఉన్నారు. నేడు మంగళగిరి కోర్టులో షూరిటీలు సమర్పించిన తర్వాత గుంటూరు జైలు నుంచి కొమ్మినేని విడుదల కానున్నారు. Also Read: Kondapalli Municipal Election: నేడు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విషయంలో వైసీపీ నేతలు పూర్తి స్థాయి మైండ్‌సెట్ మార్చుకున్నారా అంటే..... అవును, వాళ్ళ తాజా మాటలు అదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులైతే... మూడు రాజధానుల మూడ్ నుంచి పూర్తిగా బయటికి రావడమే కాకుండా..... అధిష్టానం దగ్గర కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతికి అంకురార్పణ చేసింది. అందుకు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా ఓకే చెప్పింది. కానీ... 2019లో అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా యూ టర్న్ తీసుకుని మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీంతో... అప్పటికే ప్రారంభమైన అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. కట్ చేస్తే... ఐదేళ్ళ తర్వాత సీన్ తిరగబడింది.