Yanamala Ramakrishnudu: సంక్షేమానికి కోత పెట్టారు. బడ్జెట్ లో కొత్తదనం ఎక్కడ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థికమంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వం డీబీటీల విషయంలో చెప్పేదొకటి.. చేసేదొకటి.గతేడా డీబీటీ స్కీంల కోసం జరిపిన కేటాయింపుల కంటే రూ. 2 వేల కోట్ల మేర తక్కువగా ఖర్చు పెట్టారు.సంక్షేమ పథకాల్లో కోత విధించడం వల్లే కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు పెట్టారని అర్తమవుతోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీల నిమిత్తం రూ. 54 వేల కోట్లు కేటాయించారు.
Read Also: Cyber Fraud: నమ్మినందుకు నట్టేటముంచారు.. మహిళ నుంచి రూ.12 లక్షలు స్వాహా
Also Read
సంక్షేమానికి ఈ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే కేటాయిస్తోంది.రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులు 60 శాతం మేర ఉంటే అరకొర కేటాయింపులు ఏ మాత్రం సరిపోతుంది..?విద్య, వైద్యం వంటి రంగాలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు.ఫీజు రీ-ఇంబర్సుమెంట్ లోపభూయిష్టంగా ఉండడంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి.. డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి.దీని వల్ల విద్య, వైద్య సేవలు అందక పేదలు ఇబ్బంది పడడుతున్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో కొత్తదనం లేదు.ఇప్పటి వరకు వైసీపీ నాలుగు బడ్జెట్టులు ప్రవేశ పెట్టినా ఎలాంటి అభివృద్ధి చూపడం లేదన్నారు యనమల.
Read Also: Today Stock Market Roundup 17-03-23: CEO రిజైన్.. TCS డౌన్..
పెట్టుబడి వ్యయం 10-15 శాతం మేరే ఖర్చు పెడుతున్నారు.మౌళిక వసతుల కల్పనకు నిధుల్లేవ్.గతేడాది పెట్టుబడి వ్యయం రూ. 33 వేల కోట్లు కేటాయిస్తే.. ఖర్చు చేసింది మాత్రం కేవలం రూ. 16 వేల కోట్లుగా చూపుతున్నారు.కానీ పెట్టుబడి వ్యయం నిమిత్తం ఖర్చు పెట్టింది వాస్తవానికి రూ. 7 వేల కోట్లు మాత్రమేనని సమాచారం. నాలుగు బడ్జెట్టులు చూశాక ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే నమ్మకాన్ని కలిగించ లేకపోయిందని విమర్శించారు యనమల.
తెచ్చిన అప్పుడెక్కడికి వెళ్లింది.అప్పుల ద్వారా వచ్చిన నిధులను ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు.అప్పుల విషయాన్ని బడ్జెట్టులోనో.. బడ్జెట్ స్పీచులోనే చెప్పకుంటే ఎలా..?అన్ని రూపాలుగా చేసిన అప్పులెంత..? వాటికి కడుతోన్న వడ్డీలెంత..?రాష్ట్రాన్ని కోలుకోలేని ఆర్ధిక పరిస్థితుల్లోకి నెట్టారు.వచ్చే ఎన్నికల్లో జరిగేది సివిల్ వార్.2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 11 లక్షల కోట్ల మేరకు అప్పులు చేరతాయి.
కార్పోరేట్ బారోయింగ్స్ లెక్కలు బడ్జెట్టులో ఎందుకు చూపడం లేదు..?జీఎస్డీపీ గ్రోత్ పెరగకుంటే రెవెన్యూ జనరేషన్ జరగదు. అప్పులను ఉత్పాదక రంగాల్లో పెట్టాలి.. కానీ దాన్ని ఆ రంగాలకు కాకుండా వేరే రంగాలకు మళ్లించారు.ఎఫ్ఆర్బీఎం, బడ్జెట్ నింబధనల ఉల్లంఘన యధేచ్ఛగా జరుగుతోంది.బడ్జెట్ మాన్యువల్ ప్రకారం సంప్లిమెంటరీ గ్రాంట్స్ 10 శాతం మేర పెంచకూడదు.కానీ ఇష్టానుసారంగా అసెంబ్లీ ఆమోదం పొందకుండానే అధిక ఖర్చులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో రెవెన్యూ డెఫిసిట్ తగ్గిస్తే.. ఈ ప్రభుత్వం పెంచేస్తోంది.రెవెన్యూ డెఫిసిట్ తగ్గకుంటే ప్రజలపై భారం పడుతుంది.ఓపెన్ మార్కెట్టులో ఎక్కువ వడ్డీలకు అప్పులు తెస్తున్నారు.ఓడీ, వేస్ అండ్ మీన్స్ లేని రోజంటూ లేదన్నారు యనమల.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!