Speaker Ayyanna Patrudu: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ ఈఓ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రాగా.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాలేదు.