Lady Super Star Anushka Shetty turns 42. ‘ఫేస్ ఆఫ్ ది’ సినిమాగా చెప్పుకునేది హీరోనే. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో ‘అనుష్క శెట్టి’ ముందువరుసలో ఉన్నారు. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా.. ఇమేజ్, మార్కెట్ ఏర్పరుచుకున్నారు. అనుష్క నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి.. ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఇటీవల అనుష్క…
అందం, అభినయం కలబోసిన రూపంతో ఎందరో తారలు అలరించారు. వారిలో తాను ప్రత్యేకం అంటూ అనుష్క శెట్టి మురిపించారు. పొడుగైన సుందరీమణులు ఎంత అందంగా ఉన్నా, అంతగా అలరించలేరని సినీజనం అంటూ ఉంటారు. వారి మాటను కొట్టి పారేస్తూ అనుష్క ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం. నటిగా అనుష్క తెరపై కనిపించి పదహారు సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటికీ ఆమె అభినయం జనాన్ని అలరిస్తూనే ఉంది. అనుష్క ఓ చిత్రంలో నాయికగా నటించింది అనగానే సదరు చిత్రం కోసం…