దొంగదెబ్బ.. వెన్నుపోటు. పాకిస్థాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాలిబన్లతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెబుతూనే వాళ్ల తరఫున యుద్ధం చేసేందుకు ఉగ్రవాదులను పంపింది పాక్. పంజ్ షీర్ సింహాలను నేరుగా ఢీకొట్టలేని తాలిబన్లు.. కుట్రలమారి పాకిస్థాన్ అండ తీసుకున్నారు. యుద్ధంలో తామే గెలిచా మని పంజ్ షీర్‌లో జెండా ఎగరేశారు. పంజ్ షీర్ గవర్నర్ బంగ్లా దగ్గర తాలిబన్ నేతలు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. దాని కొండ ప్రాంతంలోని లోయల్లో మాత్రం భీకర యుద్ధం నడుస్తోది. పచ్చటి…