దక్షిణ పెరూలో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 17మంది పౌరులు చనిపోయారు. ముందస్తు ఎన్నికలు, జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు జరిగిన నిరసనల్లో 17 మంది మృతి చెందారని ఆ దేశ మానవ హక్కుల కార్యాలయం సోమవారం వెల్లడించింది.
దశాబ్దాల పోరాటం తరువాత ఫెడరల్ క్యాస్ట్రో నేతృత్వంలో క్యూబాలో కమ్యునిస్ట్ ప్రభుత్వం ఏర్పాటైంది. దశాబ్ధాలుగా ఆ పార్టీనే క్యూబాలో పరిపాలన సాగిస్తోంది. అయితే, గత కొంతకాలంగా క్యూబాలో అల్లర్లు చెలరేగుతున్నాయి. కరోనా, ఆర్ధిక కుంగుబాటు, నిరుద్యోగం తదితర అంశాలు దేశాన్ని పట్టిపీడుస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున ప్రజలు హవానాకు చేరుకొని ఉద్యమం చేస్తున్నారు. క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్యుయెల్ దిజాయ్ కనెల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు స్వేచ్చకావాలి వెంటనే అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రజలు…