పెండింగ్ అభ్యర్థుల 5 స్థానాలను మూడు నాలుగు రోజుల్లో ప్రకటిస్తామని కేటీఆర్ చిట్ చాట్లో తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన తమ అభ్యర్థులు ప్రజల్లో ఉన్నారని.. ప్రచారంలో దూసుకుపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి 40 చోట్ల అభ్యర్థులు లేరని.. కానీ 70 స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని పేర్కొన్నారు. అది చూసి ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.
తివారీ ఇన్ స్టాగ్రామ్ లో తన రిటైర్మెంట్ ప్రకటనను పోస్టు చేశాడు. క్రికెట్ వల్లే తాను ఇంతటివాడ్నయ్యానని, క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని భావోద్వేగం చెందాడు. తన కెరీర్ ఆద్యంతం వెన్నంటి ఉన్న కుటుంబ సభ్యులకు, భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
చాలా వివాదాలు మరియు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ కార్యదర్శి జై షా టోర్నీ మొత్తం షెడ్యూల్‌ను ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు త్వరలో భారత్ రాష్ట్రీయ సమితిగా మారనుంది. త్వరలో సీఎం కేసీఆర్ కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. దానికి భారత్ రాష్ట్రీయ సమితి అని పేరు పెట్టనున్నారు. దీనికి కారు గుర్తునే కొనసాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ పేరు మార్పు, బైలాస్‌లో మార్పులపై విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల సంఘంతో TRS ఇప్పటికే చర్చలు పూర్తి చేసింది. గులాబీ బాస్ ఆలోచనలు చూస్తుంటే TRS కాస్తా.. అతి త్వరలోనే BRSగా మారనుండటం…