Chinmayi: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గాత్రంతో సంగీత అభిమానులను ఎంతగా అలరించిందో.. ఆడవాళ్లకు ఏదైనా ఆపద వచ్చిందంటే సోషల్ మీడియాలో అమాంతం ప్రత్యక్షమయ్యి అండగా నిలుస్తుంది. ఆడవారిని హింసించడం, వేధించడం లాంటివి చేస్తే.. వారిని తనదైన రీతిలో ఏకిపారేస్తుంది.
Annapurna: అలనాటి నటి అన్నపూర్ణ గురించి ఇప్పటితరానికి తెలియకపోవచ్చు కానీ, అప్పటితరానికి ఆమె అంటే ఎవరో చెప్పనవసరం లేదు. నిర్మలమ్మ తరువాత అన్ని క్యారెక్టర్స్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక 60 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ బామ్మ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా రియల్, వర్చువల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి షూటింగ్ చేసుకునే సౌకర్యాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా సంయుక్తంగా హైదరాబాద్ లో కల్పించాయి. 'స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్' తో నిర్మాతలు పరిమితమైన బడ్జెట్ లో వర్చువల్ షూటింగ్ జరుపుకోవచ్చని అక్కినేని నాగార్జున చెబుతున్నారు.
అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు 34 ఏళ్ల అనురాగ్ మాలూను క్షేమంగా ఉన్నాడు. అనురాగ్ ను సజీవంగా రక్షించారు. ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరం క్యాంప్ III దిగువన ఉన్న పగుళ్లలో అనురాగ్ ను కనుగొన్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌కు చెందిన థానేశ్వర్ గురాగైన్ తెలిపారు. కానీ మాలూ ఆరోగ్యం విషమంగా ఉంది మరియు ప్రస్తుతం పోఖారాలోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని గురాగైన్ తెలిపారు.
నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకురాలు సజీవంగా దొరికింది. బల్జీత్ కౌర్ అనే 27 ఏళ్ల భారతీయ మహిళా పర్వతారోహకురాలు ఈ రోజు సజీవంగా గుర్తించారు. ఆమె సమ్మిట్ పాయింట్ నుండి దిగుతుండగా అన్నపూర్ణ మౌంట్ IV క్యాంప్ సమీపంలో అదృశ్యమైన ఒక రోజు తర్వాత, ఆమె ఆచూకి లభించింది.