Annapurna: కీర్తి ఆత్మహత్య చేసుకుంది.. స్టేజిమీద ఏడ్చిన అన్నపూర్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annapurna: అలనాటి నటి అన్నపూర్ణ గురించి ఇప్పటితరానికి తెలియకపోవచ్చు కానీ, అప్పటితరానికి ఆమె అంటే ఎవరో చెప్పనవసరం లేదు. నిర్మలమ్మ తరువాత అన్ని క్యారెక్టర్స్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక 60 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ బామ్మ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక సినిమాలే కాకుండా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కామెడీ షోస్ లో కూడా అన్నపూర్ణ పాల్గొని నవ్విస్తోంది. ఆ నవ్వుల వెనుక విషాదం ఉందని మొదటిసారి తెలిసింది. తాజాగా అన్నపూర్ణ.. సుమ షోలో తన జీవితంలో జరిగిన విషాదాన్న చెప్పుకొని స్టేజిపైనే కన్నీరు పెట్టుకుంది. ఎదిగిన కూతురు.. తోడుగా ఉంటుంది అనుకున్న కూతురు.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం .. తట్టుకోలేని బాధను మిగిల్చిందని ఆమె ఏడుస్తుంటే.. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకున్నారు. అన్నపూర్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకుంది. కానీ, ఆమెకు పిల్లలు లేరు. ఒక పాపను పెంచుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు.
Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
” నాకు పిల్లలు లేరు. అందుకే బాగా ఆలోచించి. కీర్తిని దత్తత తీసుకున్నాం. తనను ఎంతో అల్లారుముద్దుగా పెంచాను. చదివించాను. పెళ్లి చేసాను. వారికి ఒక పాప పుట్టింది. ఆ పాపకు ఐదేళ్లు వచ్చినా కూడా మాటలు రాలేదు. డాక్టర్స్ దగ్గరకు తీసుకెళ్లారు.. థెరపీ చేయించారు. కానీ లాభం లేకుండా పోయింది. అలా పాప విషయమై బెంగ పెట్టుకున్నకీర్తి.. ఆ బెంగతోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. నేను బజ్జీలు పట్టుకొచ్చి పిలిచాను. రెండు తిని ఇక చాలు మమ్మీ అని చెప్పింది. వాళ్ల అత్తగారు ఊరెళ్తున్నారని అంటే ఇక్కడే పడుకో అమ్మా అని అన్నాను. లేదు లేదు మా ఆయన ఉంటాడు కదా నేను అక్కడే పడుకుంటాను అని చెప్పి వెళ్లిపోయింది. తాను ఉరివేసుకుంటుందనే ఆలోచనే నాకు రాలేదు” అని కంటతడి పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ షో చూసిన అభిమానులు అన్నపూర్ణమ్మ స్ట్రాంగ్ గా ఉండండి అని కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు