Annamayya District: ఓ వివాహిత అదృశ్యం కేసు.. రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రామసముద్రంలో చోటు చేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా రామసముద్రంలోని ఎగువపల్లె, శ్రీరాములపల్లి ప్రజల మధ్య వివాహిత అదృశ్యం కేసులో ఘర్షణ చెలరేగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఎర్రబోయినపల్లికు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎస్సై రవికుమార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కారంపొడి చల్లి దాడి చేయడానికి ప్రయత్నం చేశారు.. అంతేకాదు, పోలీస్ స్టేషన్‌లోకి దూసుకుపోవడానికి ప్రయత్నం చేశారు.. దీంతో, పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం మూసి వేసి, ఎస్సై రవికుమార్‌ను లోపల ఉంచిన సిబ్బంది, స్టేషన్ గేట్లు మూసేశారు. ఈ గొడవల్లో మా తప్పు లేకపోయినా మా వారిపై కేసులు పెట్టారని… దీన్ని మేం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని.. ఎస్సైను అప్పగించే వరకు స్టేషన్ నుంచి కదిలేది లేదంటూ కూర్చొని నిరసనకు దిగారు టీడీపీ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడడంతో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా రంగంలోకి దిగి స్థానిక కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.. దీంతో, పరిస్థితి అదుపులోకి వచ్చింది..
Read Also: PM Modi: కెనడాకు వెళ్తూ, సైప్రస్‌లో ఆగనున్న మోడీ.. టర్కీకి బిగ్ మెసేజ్..