అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.. పీసీసీఎఫ్ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్..
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో 78 మందితో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలు అందరూ రాశాడు. తాజాగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ 78 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థిని ఆనందల మల్లికకు 294 మార్కులు వచ్చాయి. మిగతా 77 మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిలయ్యారు. జూనియర్ కాలేజీ లో ప్రిన్సిపాల్, లెక్చలర్లు లేకపోవడంతో ఉత్తీర్ణశాతం పూర్తిగా దెబ్బతింది.
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈత సరదా ముగ్గురు చిన్నారుల ప్రాణాలను గాల్లో కలిపేసింది. శ్రీరామనవమి వేడుకల్లో గ్రామమంతా ఆనందోత్సవాల్లో ఉన్న సమయంలో అక్కడ చిన్నారుల మృతి వార్త విషాదాన్ని నింపింది. చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో నరసరాజు కుమారుడు దేవాన్, శేఖర్ రాజు కుమారుడు విజయ్, వెంకటేష్ కుమారుడు యశ్వంత్ అప్పటివరకు సీతారాముల ఊరేగింపులో పాల్గొని.. ఈత కోసం సమీపంలోని చెరువులోకి వెళ్లారు. మట్టి కోసం తవ్విన గుంటల్లో ఈత కోసం…
సంబేపల్లి మండలం మోటకట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో హంద్రీనీవా HNSS యూనిట్-2 పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రమ (50) దుర్మరణం పాలయ్యారు.. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.. పీలేరు నుండి రాయచోటి కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. సుగాలి రమ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
చెట్టుకు చీరకట్టినా వదలన్నట్టున్నరు కామాంధులు. ఇటీవల దేశవ్యాప్తంగా లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి. మహిళలు, యువతులు, చిన్నపిల్లలు, చివరికి వృద్ధ మహిళలను కూడా వదలడం లేదు. మరికొందరు మృగాలు మైనర్ బాలుడిపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగుచూసింది. సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లిలో ఈనెల 27న ఇంటి ముందు సైకిల్ తోక్కుకుంటున్న 9 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.…
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి.
అన్నమయ్య జిల్లాలో విషాదయం చోటు చేసుకుంది.. ఓబులవారిపల్లి మండలం వై కోట గుండాల కోన సిద్దేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు.. అయితే, క్షేత్రానికి వెళ్తున్న భక్తులపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దాడి చేసింది.. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
పేదల ఆదాయాన్ని పెంచడమే తన అభిమతం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లె గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు.
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల తహసీల్దారు శ్రావణికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేగింది. కార్యాలయంలో మంగళవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆమె మొబైల్ ఫోన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడున్నారు.? ఏమి చేస్తున్నారు..? విధుల్లో ఉన్నారా..? మేము కార్యాలయం వద్దకు వస్తున్నాం.. బయటకు రండి అంటూ బెదిరించేలా మాట్లాడారు గుర్తుతెలియని వ్యక్తులు.
నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్నారు. అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన వెళ్లనున్నారు. గాలివీడులో ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన పరిశీలించనున్నారు.