ఇదిలా ఉంటే, సీఎం స్టాలిన్‌పై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ పార్టీ నేత కల్తీ మద్యం మరణాలు బీజేపీ కుట్రగా అనుమానించారు. డీఎంకేకి చెందిన ఆర్ఎస్ భారతీ మాట్లాడుతూ కళ్లకురిచి మద్యం మరణాలను అన్నామలై కుట్రగా అభివర్ణించారు.
తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు పడింది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళి సై ఆరోపించారు. Viral Video: వె య్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో…
Annamalai: ప్రధానిగా వరసగా మూడోసారి నరేంద్రమోడీ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
Annamalai: తమిళనాడులో అధికార డీఎంకేకి తలనొప్పిగా మారిన బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూర్ నుంచి ఓడిపోవడంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగింది. డీఎంకే కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థి గెలుపొందడం కన్నా, అన్నామలై ఓటమినే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఉన్నారు.
Annamalai: డీఎంకే నేత, ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి తూత్తుకూడి నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. కనిమొళి 5,40,729 ఓట్లతో తూత్తుక్కుడి స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
Annamalai: తమిళనాడులో తమ ఉనికిని చాటాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో కనీసం 3 సీట్ల వరకు వస్తాయని అంతా భావించారు.
Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న తమిళనాడులో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’’గా ఉందని అన్నారు.
Puri temple Row: పూరీ జగన్నాథ ఆలయం ప్రస్తుతం ఎన్నికల వార్తల్లో నిలుస్తోంది. పూరీ జగన్నాథుడి ఆలయంలో రత్నబండార్ తాళాలపై ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మోడీ గుండెలో బండి సంజయ్ కి ప్రత్యేక స్థానం ఉందని తమిళనాడు బీజేపీ అభ్యర్థి అన్నమలై అన్నారు. సౌతిండియాలో బీజేపీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ కు జాతీయ పదవిచ్చారని తెలిపారు. యూత్ ఐకాన్... సంజయ్ అని కొనియాడారు. బండి సంజయ్ స్పూర్తితోనే తాను తమిళనాడులో పాదయాత్ర చేసినట్లు అన్నామలై తెలిపారు. ఈ ఎన్నికల్లో 60 శాతం ఓట్లతో సంజయ్ ను గెలిపించండని.. బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లేనని అన్నామలై పేర్కొన్నారు.