Annamalai: ద్రవిడ రాజకీయాల్లో జాతీయవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కే అన్నామలై. బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఒక తురుపుముక్కగా ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించే దిశగా ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. 39 ఏళ్ల ఈ మాజీ ఐపీఎస్ అధికారికి బీజేపీ అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై లోక్‌సభ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ…
Chinese flag on Isro ad: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఇస్రో ప్రకటన వివాదాస్పదంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖర పట్నంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇస్రో స్పేస్‌పోర్టు గురించి డీఎంకే మంత్రి చేసిన ప్రకటనలో చైనా జెండా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాకెట్ పై భాగంలో చైనా జెండా కలిగి ఉండటంతో డీఎంకే అభాసుపాలవుతోంది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఇస్రో కులశేఖరపట్టణంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడాన్ని…
Annamalai: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ రచ్చకు కారణమవుతున్నాయి. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడండి’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది.
Udhayanidhi Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటది, దీన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బీజేపీ పార్టీ ఉదయనిధి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై…
తమిళనాడు రాజకీయాలు నిత్యం రసవత్తరంగానే కొనసాగుతుంటాయి. రాష్ట్రంలో ద్రవిడ పార్టీలకే తమిళ ప్రజల మద్దతుగా నిలుస్తారు. జాతీయ పార్టీలు ఎంత ప్రయత్నించినా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమనే చెప్పుకోవాలి.
Annamalai: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా.. అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సందర్భంగా రెజ్లర్లు వారి మద్దతుదారులు కొత్త పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లి ఆందోళన నిర్వహించాలని అనుకున్నారు. దీంతో రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు.
Annamalai: కర్ణాటకలో రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. అధికారంలోకి రావడానికి బీజేపీ, కాంగ్రెస్ కష్టపడుతున్నాయి. ఇదిలా ఉంటే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దుతు తెలపడం కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. దీంతో బీజేపీపై, సుదీప్ పై కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. తాజాగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ విషయంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ రాహుల్ గాంధీకి మద్దతుపలకాన్ని ఆయన ప్రస్తావిస్తూ గ్రాండ్ ఓల్డ్ పార్టీపై…
Tamil Nadu BJP chief Annamalai to get Z-category security: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి కేంద్ర భారీ సెక్యూరిటీని కల్పించింది. ఏకంగా జెడ్-కేటగిరి భద్రతను కల్పించనుంది. అన్నామలై రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలైకి గతంలో వై-కేటగిరి సెక్యూరిటీ ఉంది. అయితే ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నామలై.
Annamalai criticized Udayanidhi Stalin as a playboy: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశిస్తూ..‘క్రౌన్ ప్రిన్స్ ప్లే బాయ్ గానే మిగిలిపోతాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ప్లేబాయ్ గానే మిగిలిపోతాడంటూ విమర్శించారు. అన్నూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న అన్నామలై, డీఎంకే టార్గెట్…