తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై ఆరు కొరడా దెబ్బలు కొట్టించుకుని.. మురుగన్‌కు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ.. రాష్ట్రంలో స్టాలిన్ సర్కార్ ను గద్దె దించేందుకు ఇవాళ్టి నుంచి 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేస్తానని శపథం చేశారు.
Anna University: చెన్నై అన్నా యూనివర్సిటీలో దారుణం జరిగింది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు.
తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
Annamalai: చెన్నై ఎయిర్‌పోర్టులో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్, నటి త్రిష ఫోటోల వెనక రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉందని, ఫోటోలను తీసి డీఎంకే ఐటీ టీమ్‌కి ఇచ్చిందని తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై ఆరోపించారు. చెన్నై ఎయిర్ పోర్టులో విజయ్-త్రిషలు ప్రైవేట్ సెక్యూరిటీ చెక్ జరుగుతున్న సమయంలో వారి వీడియోను తీశారని అన్నామలై అన్నారు.
తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tamil Nadu: తమిళనాడులో రాజకీయ హత్యలు ప్రకంపలను సృష్టిస్తున్నాయి. ఈ నెలలో బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ని దుండగులు హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పదవి నుంచి దిగిపోవాలని ఏఐడీఎంకే, బీజేపీలు డిమాండ్ చేశాయి.
Union Budget: కేంద్ర బడ్జెట్ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారుణమవుతోంది. బడ్జెట్లో కేంద్రం తమిళనాడును పట్టించుకోలేదని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Annamalai: తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ చీఫ్ అన్నామలై ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగైని ఉద్దేశిస్తూ హిస్టరీ-షీటర్‌గా పేర్కొన్నారు.
Annamalai: బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై పదవీ కాలం జూలై 17తో ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్నామలై కొన్ని రోజుల పాటు రాజకీయాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.