Annamalai: కమలం ఎప్పటికీ వికసించదు, అన్నామలై రాజీనామా చేయాలి..కనిమొళి డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: డీఎంకే నేత, ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి తూత్తుకూడి నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. కనిమొళి 5,40,729 ఓట్లతో తూత్తుక్కుడి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గురువారం ఆమె తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై విరుచుకుపడ్డారు. కరుణానిధిపై చేసిన వ్యాఖ్యలపై అన్నామలై తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్నామలై తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి పోటీ చేశారు. అయితే, ఆయన డీఎంకే నేత గణపతి రాజ్‌కుమార్ చేతిలో లక్షకు పైగా మెజారిటీతో ఓడిపోయారు.
Read Also: Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ
Also Read
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పరాజయంపై ఆయన బుధవారం మాట్లాడారు. తమకు సీట్లు దక్కకున్నా ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చకుంటామని, వచ్చే ఎన్నికల్లో్ తప్పకుండా తమిళ నేలపై నుంచి బీజేపీ ఎంపీ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా ‘‘తన తండ్రి కరుణానిధి అయితే నేను కూడా ఈపాటికి ఎన్నికల్లో గెలిచి ఉండేవాడిని, మా నాన్న పేరు కుప్పుస్వామి, కాబట్టి నాకు కొంత సమయం పడుతుంది’’ అని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు కనిమొళి ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు అన్నామలై తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోడీపై విమర్శలు చేసేందుకు కనిమొళికి ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. దీనిపై కూడా ఆమె స్పందించారు. ‘‘ అన్నామలై నన్ను తరుచుగా ఒక ప్రశ్న అడిగేవాడు. కనిమొళికి ఎలాంటి అర్హతలు ఉన్నాయి?. ఎలాంటి అర్హతలు లేకుండా బీజేపీకి అధినేతగా కొనసాగడం మంచిది కాదు. తమిళనాడులో కమలం(బీజేపీ) ఎప్పటికీ వికసించదు’’ అని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!