పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు.
అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలతో సహా తల్లి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువుకట్ట పై నుంచి పిల్లలతో పాటు దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం నీరుగుట్టివారిపల్లెలో ఓ కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల పశువులా ప్రవర్తించాడు. తల్లిదండ్రులపై పట్ల మానవత్వం లేకుండా ఆ కొడుకు మృగంలా వ్యవహరించాడు. ఆస్తికోసం నడిరోడ్డుపై తల్లిదండ్రులను ఆ కసాయి కొడుకు చితకబాదాడు.
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. జిల్లా సరిహద్దుల్లో తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారుతో ఢీకొట్టడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ నెల 9, 10 తేదీల్లో సీఎం వైఎస్ జగన్ అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. ఉదయం 12 గంటలకు సీఎం జగన్ రాయచోటి చేరుకోనున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ కుమారుడు వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరుకానున్నారు.