ఈ ఏడాది మరో సౌత్ సెలెబ్రిటీ కపుల్ విడాకులతో అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పటికీ టాలీవుడ్ లో చై, సామ్ విడాకుల విషయం గురించి ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నడి ఇమ్మాన్ తాజాగా తన భార్యతో విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాదాపు 13 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత తన…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంతపెద్ద స్టార్ అవ్వడానికి కారణం ఆయన సింప్లిసిటీ అన్న విషయం తెలిసిందే. ఆయనకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉండడానికి రజిని స్టైల్ తో పాటు ఇదీ ఒక రీజన్. తాజాగా సూపర్ స్టార్ అనారోగ్యంతో ఉన్న తన అభిమానికి ఇచ్చిన సర్ప్రైజ్ గురించి చర్చ నడుస్తోంది. సదరు అభిమానికి రజినీ చాలా ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని పంపాడు. తలైవా ఆ అభిమాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆమెను వ్యక్తిగతంగా…
సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 12న తన 71వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ పాపులర్ స్టార్ కు నిన్న సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పిక్స్ సోషల్ ఇండియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్, కూతురు సౌందర్య, అల్లుడు విశాఖన్, మనవళ్లు యాత్ర ధనుష్, వేద్…
దీపావళికి విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం ఇప్పటికీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు ఉన్నప్పటికీ ‘పెద్దన్న’జోరు ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పలు చోట్ల థియేటర్లు హౌజ్ ఫుల్ కావడం విశేషం. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లు దాటింది. ఈ వారం చివరికల్లా ఈ సినిమా 250 కోట్ల రూపాయల…
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ‘మహానటి’తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తరువాత చాలా వరకు గ్లామర్ పాత్రలను దూరం పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కేవలం కంటెంట్ బేస్డ్, లేడీ ఓరియెంటెడ్ లేదా తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలను ఒప్పుకోవడం లేదు. ‘మహానటి’తో వచ్చిన ఫేమ్ ను అలాగే కంటిన్యూ చేయాలనుకుంటోంది. అయితే దాని కోసం సోదరి పాత్రలకు కూడా ఓకే చెప్పడానికి వెనకాడడం లేదు. సీనియర్ హీరోలకు…
సినిమా అభిమానులు తమ అభిమాన హిరోలు, హిరోయిన్లపై ఒక్కోలాగా తమ అభిమానాన్ని చాటి చెబుతుంటారు. ఓ అభిమాని సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తమిళ నాడు తిరుచ్చిలోని ఓ హోటల్ యజమాని కర్ణన్ తన అభిమాన నటు డు రజినీ కాంత్ పై అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. అన్నా త్తే సినిమా విడుదల సందర్భంగా రూపాయికే దోశను అందజేస్తూ పేదల కడుపు నింపుతున్నాడు ఈ హోటల్ యజమాని కర్ణన్. అన్నా త్తే సినమా సూపర్…
తెలుగులో తమిళ హీరోల మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ టాప్ లో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో రజనీకాంత్ సినిమా ఎప్పుడు విడుదలైనా తమిళంలోలాగే పండుగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా రజనీకాంత్ నటించిన “అన్నాత్తే” చిత్రం విడుదలైంది. శివ దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం “పెద్దన్న” అనే ఈ దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌లోని…
సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే దీపావళి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖూష్బూ, మీనా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు కావడంతో తలైవా ఫ్యాన్స్ కి పండగ వాతావరణం మొదలైయిపోయింది. రజినీ మూవీ అంటే ఫస్ట్ డే.. ఫస్ట్ డే పడాల్సిందే.. ఆరోజు స్కూల్ ఉందా.. ఆఫీస్ ఉందా..? ఇంట్లో…
ఈ దీపావళికి బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో రెండు తమిళ సినిమాలు తెలుగులో విడుదల అవుతుండగా, మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతీ దర్శకత్వంలో రూపొందిన “మంచి రోజులొచ్చాయి” స్ట్రెయిట్ తెలుగు సినిమా కాగా, డబ్బింగ్ చిత్రాలు రజనీకాంత్ “పెద్దన్న”, విశాల్ “ఎనిమీ” రేపు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన…
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’ సినిమా టైటిల్ ప్రకటించినప్పటికీ నుంచి ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ వరకు అభిమానుల్లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. కాగా ఈ సినిమా ఒక్క ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల అవుతుంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో 1100 థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఒక తమిళ చిత్రానికి ఇదే అతిపెద్ద ఓవర్సీస్ విడుదల అని…