సినిమా అభిమానులు తమ అభిమాన హిరోలు, హిరోయిన్లపై ఒక్కోలాగా తమ అభిమానాన్ని చాటి చెబుతుంటారు. ఓ అభిమాని సూపర్ స్టార్ రజినీకాంత్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తమిళ నాడు తిరుచ్చిలోని ఓ హోటల్ యజమాని కర్ణన్ తన అభిమాన నటు డు రజినీ కాంత్ పై అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. అన్నా త్తే సినిమా విడుదల సందర్భంగా రూపాయికే దోశను అందజేస్తూ పేదల కడుపు నింపుతున్నాడు ఈ హోటల్ యజమాని కర్ణన్.
అన్నా త్తే సినమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ.. వినూత్నంగా అభి మానం చాటుకున్నాడు కర్ణన్. దీంతో కర్ణన్‌ను అందరూ అభినం దిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ మీద అభిమానంతోనే ఇదంతా చేస్తున్నాని, తనకు రజిని అంటే ఎంతో అభిమానం అని కర్ణన్ పేర్కొన్నాడు.