ప్రేమికుల రోజున ప్రజలు ఆవును కౌగిలించుకోవాలన్న ప్రభుత్వ సంస్థ విజ్ఞప్తిని సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తడంతో భారత జంతు సంరక్షణ బోర్డు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
Celebrate "Cow Hug Day" On Valentine's Day: ప్రేమికుల రోజుకు (వాలెంటైన్స్ డే)కి మరో వారమే సమయం ఉంది. అయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వినూత్న ప్రకటన చేసింది. వాలెంటైన్స్ డేను ‘‘ కౌ హగ్ డే’’గా జరుపుకోండని సూచించింది. ఆవును కౌగిలించుకోవడం ద్వారా ఫిబ్రవరి 14 రోజును జరుపుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేసింది.