Anemia Causes: రక్తహీనత వేధిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, అలాగే గర్భిణీలలో 52% మంది భారతీయులు రక్తహీనతతో బాధపడుతున్నారు.
READ ALSO: AP High Court: కడప ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్..
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
రక్తహీనతతో ఏయే సమస్యలు వస్తాయంటే..
రక్తహీనత ఉన్నవారిలో శరీర శక్తి తక్కువగా ఉంటుంది. వారు త్వరగా అలసిపోవడం, నిరుత్సాహం, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపై అధిక ఒత్తిడి పడి, గుండె వాపు లేదా ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీయవచ్చని వైద్యులు అంటున్నారు.
సాధారణంగా మనం సరిగ్గా తినకపోవడం వల్ల రక్తం తక్కువగా ఉంటుందని అంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాస్తవానికి రక్తహీనత ఉన్నవారికి ఆకలి తగ్గుతుందని, అందుకే వాళ్లు తినడం తగ్గిస్తారని చెబుతున్నారు. మహిళల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, హార్మోన్ల సమస్యలు (ఉదా: థైరాయిడ్), గర్భసంచి గడ్డలు వంటి పరిస్థితులు రక్తహీనతకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత ప్రమాదకరం, వీళ్లు రక్తహీనతతో బాధపడుతుంటే వీరికి పుట్టే బిడ్డలు తక్కువ బరువుతో పుడతారని, అలాగే వీళ్లను ప్రసవం తర్వాత తీవ్రమైన నీరసం, బలహీనత ఆవరిస్తుందని చెబుతున్నారు.
కడుపులో అల్సర్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా కూడా రక్తహీనత వస్తుందని, శరీరంలో ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుందని నిపుణులు పేర్కొన్నారు. రక్తహీనతను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదని వైద్యులు హెచ్చరించారు. దీని లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన పరీక్షలు చేయించుకొని, ఆహారంలో ఇనుము ఉన్న పదార్థాలు (ఉదా: పాలకూర, కూరగాయలు, జాగ్రి, బీట్రూట్, పొడి పండ్లు) చేర్చుకోవాలని చెబుతున్నారు.
READ ALSO: Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..