తిరుమల పార్వేటి ఉత్సవాల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. బాగా పాతదై, కూలడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో అత్యద్భుతంగా నూతన మండపాన్ని టీటీడీ నిర్మించిందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
నిర్మాణ రంగంలో కొత్తదనం సృష్టించాలనే ఆశయంతో 2015 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, 30 పైగా ప్రాజెక్టులతో, 8 వేల మందికి పైగా సొంతింటి కల నెరవేర్చి, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వేలాది కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించి, స్థిరాస్తి రంగంలో తమదైన ముద్ర వేసుకుని 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుపెడుతోంది.
మద్యం మత్తులో ఉన్నప్పుడు కొందరికి అసలు స్పృహ ఉండదు. మత్తులో ఏం చేస్తున్నారో వారికి అవగాహన ఉండదు. మద్యం సేవించి ఆ మత్తులో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజమే గెలిచిందని అంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ . నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే చనిపోయింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
మాజీ మంత్రి కొడాలి నాని మేనకోడలు వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు డా.స్నేహ, వరుడు డా.అనురాగ్ దీపక్‌లను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.
ఏపీలో జరిగే ఎన్నికలు లోకల్, నాన్లోకల్ మధ్య పోటీ అంటూ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోలేదని ఆయన వెల్లడించారు.