ఏపీ ఈ-చలాన్‌ల డబ్బును మాయం చేశారని గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు వెల్లడించారు. డీజీ అకౌంట్‌కు అనేక రకాల రూపాలలో ఈ- డేటా చలానాకు సంబంధించిన డబ్బులు వస్తాయని.. డీజీ అకౌంట్స్ ద్వారా వచ్చే నగదు మాయమవడం మొదలైందని ఆయన తెలిపారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శించుకోనున్నారు.
చంద్రబాబు అరెస్టుతో బాధలో ఉంటే బాలయ్య తన సినిమా రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ప్రశ్నించారు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలు పెరిగాయాని ఇటీవల ఆ సంస్థే ప్రకటించిందని ఆయన తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు బదిలీ అయింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. దసరా సెలవుల తర్వాతే విచారిస్తామని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైఎస్సార్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటించబడ్డాయి. వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసిన స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. ఎంపికైన వారి జాబితాను కమిటీ వెల్లడించింది.
Off The Record: ఎన్నికలు ఎప్పుడొచ్చినా…. ఉత్తరాంధ్రలో ఒక స్లోగన్ మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. స్ధానిక నాయకత్వానికే పెద్దపీట వేయాలంటూ గొంతెత్తుతారు విద్యావంతులు. ముందైతే ఊపుగా చర్చోపచర్చలు జరుగుతాయిగానీ… తీరా ఎన్నికల తెర మీదికి వచ్చేసరికి అంతా సైలెంట్ అయిపోతారు. కానీ… తొలిసారిగా ఇదో రాజకీయ నినాదంగా మారబోవడమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ మీద కొత్త డిబేట్ మొదలైంది. రాజధాని మార్పు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై రకరకాల చర్చలు…
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని అధికారులు బులెటిన్‌లో తెలిపారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ కేసులో రాజేష్‌ను సీఐడీ విచారించింది. ఉదయం పదిన్నర నుంచి సీఐడీ విచారణ కొనసాగింది.