విశాఖ రావాలన్న సీఎం నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఏపీ ఐటీ మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు. విజయవాడ నుంచి విశాఖకు వస్తుంటే ఎందుకు అభ్యంతరమో వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పాలన్నారు. సీఎం ఎక్కడ నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చన్నారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం చెన్నై పాలెం క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం విజయవాడకు వెళుతున్న కారులో డ్రైవర్ నిద్ర మత్తు లోకి జారుకోవడంతో రోడ్డు దాటుతున్న మహిళను అనంతరం ముందు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది.
కుల గణన ప్రక్రియ వాయిదా పడిందని.. ఈ నెల 27కు బదులు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు. పేదల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకే కులగణన అంటూ ఆయన పేర్కొన్నారు.
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telugu News, National News, International News, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections,
Top Headlines, Top News, Telangana, Andhrapradesh, Telangana Elections 2023, Telangana Polls, Telangana Assembly Elections, National News, International News
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్–న్యూన్ కిమ్ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమయ్యారు. మర్యాద పూర్వకంగా చాంగ్–న్యూన్ కిమ్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో విశాఖ నుంచే పరిపాలన విషయంలో కీలక పరిణామం జరిగింది. విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలను గుర్తించారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కారు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.