ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రైతులకు అండగా నిలుస్తామని ధైర్యాన్ని ఇస్తున్నారు. బాపట్ల జిల్లా పాత నందాయపాలెంలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రైతులను చూస్తుంటే బాధేస్తుందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్ల వ్యవహారం రాజకీయ రచ్చ రాజేస్తోంది. ఓట్లకు సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. కొంతకాలం నుంచి ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది.
ఇవాళ ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నానని ప్రలందరూ ఆహ్వానితులే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. ప్రగతి భవన్.. జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాభవన్‌గా మారిన విషయం తెలిసిందే.
Michoung Cyclone: తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ ఉత్తర తెలంగాణపై మరింత ప్రభావం చూపనుంది.
మిచౌంగ్ తీవ్ర తుఫాన్‌తో ఉప్పెన ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మీటర్ అంతకు మించిన ఎత్తున సముద్రపు అలలు విరుచుకుపడి.. ఐదు కిలోమీటర్ల ముందుకు సముద్రపు నీరు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెల్లూరుకు 170కి.మీ దూరంలో కొనసాగుతున్న మిచౌంగ్.. రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది.
టీడీపీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు బాధిత వర్గాలకు అండగా ఉండాలి.. చేతనైన సాయం చేయాలన్నారు.
తుఫాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు.