తుఫాన్ కారణంగా రైతులంతా నష్టపోయారని.. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.
తూర్పు గోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీలో మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదని.. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ననే ఒన్స్ మోర్ అవుతారని మంత్రి పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, దగ్గుబాటి పురంధరేశ్వరి, కలెక్టర్ ఢిల్లీరావు పాల్గొన్నారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను నిర్మలా సీతారామన్ సందర్శించారు.
శ్రీశైలం ఆలయ ప్రాకారంపై శిల్పాలను డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసి స్థల పురాణ గ్రంథాన్ని నిపుణులతో తయారు చేయిస్తామని ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు.
ప్రకాశం జిల్లా దోర్నాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి బుద్ది వక్రమార్గం పట్టింది. దోర్నాల ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థినిని ట్రాప్ చేసిన ఉపాధ్యాయుడు ప్రసాద్.. తనను ఇంట్లోకి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకొని ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి బంధువులు ఆ టీచర్‌ను నిలదీశారు.
తిరుపతి జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. తీర ప్రాంతమైన సూళ్లూరుపేట నియోజకవర్గంలో తుఫాన్ దెబ్బకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తే మనసు కలిచి వేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ సీఎం జగన్ ప్రజల కోసం రెండు ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. వైఎస్సార్ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తానే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేఏ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. తాను చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిందని.. 65 సీట్లు వస్తాయని చెప్పానని, అలానే వచ్చాయన్నారు కేఏ పాల్.