ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం ఏపీ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మే 13 నుంచి 19 వరకు ఈఏపీసెట్, మే 8న ఈసెట్, 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్‌సెట్, జూన్ 9న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
గూగుల్, యూట్యూబ్‌లకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కేసులో విచారణ జరిపిన జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆదేశాల మేరకు వివిధ రీజనల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంట్ నియోజకవర్గాలు, జిల్లాల బాధ్యతలను వైసీపీ అధిష్ఠానం అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించగా.. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును నియమించారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాటిపర్తి పంచాయితీ కాశీపురం గ్రామంలో తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో భార్య ఓ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పవన్ పాల్గొననున్నారు.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై కీలక చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఒకట్రెండు రోజుల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకి ఇవ్వాలని జనసేన నేత జానీ మాస్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో జనసేన నేత జానీ మాస్టర్ ఆధ్వర్యంలో కె.వి.ఆర్ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్ల వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా.. ఈనెల 29 వరకు గడువును ఏపీ కాంగ్రెస్ కమిటీ పెంచింది. ఈ నెల 29 వరకు కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ కాంగ్రెస్ సమయం ఇచ్చింది.
ఏపీలో టీడీపీతో పొత్తుపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ వైపు సీఎం జగన్, మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన చర్చించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పొత్తుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఏపీలో పొత్తులపై కొన్ని రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని అమిత్ షా అన్నారు.
చంద్రబాబు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని, పిల్లలకు ఇంగ్లీషు మీడియం ఇవ్వొద్దని కోర్టుకు వెళ్లారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లివూరులో గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు.