జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలింటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీరియస్ అయిన ప్రభుత్వం.. గుంటూరు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో మే నెల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది.
నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే 'సిద్ధం' బహిరంగ సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
YS Raja Reddy: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముద్దుల తనయుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ప్రియ అట్లూరితో రాజారెడ్డి వివాహం నేడు ఘనంగా జరిగింది. వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ లో ఘనంగా జరిగాయి.. మూడురోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
ప్రముఖ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ 'ఎడెక్స్'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం "ఎడెక్స్"ల మధ్య ఒప్పందం కుదిరింది.
ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. నేను చంద్రబాబు లాగా కుర్చీ లాక్కున్న లక్షణం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ లాక్కున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్‌లో కూర్చున్నానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి కుర్చీలో నేను కూర్చోలేదన్నారు.
హరిత విప్లవం నీలి విప్లవం వచ్చాయని.. ఉద్యోగ విప్లవం తెచ్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డేనని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
రాజకీయ ప్రకటనల విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈఓ ఎంకే మీనా సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల ప్రకటనల విషయంపై చర్చించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పని సరి అని సీఈవో రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు.
ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు.