Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులు-అధికారులు మధ్య చర్చలు సఫలం అయ్యారు.. దీంతో, నిరసనను విరమించారు ఏయూ విద్యార్థులు.. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ.. జిల్లా అధికారుల బృందం.. దసరా సెలవులులోగా విద్యార్థుల డిమాండ్లను పూర్తి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.. ఇక, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం.. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.. మరోవైపు, ఆంధ్రా…
Students Protest: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ బంద్ ఉద్రిక్తతలకు దారి తీసింది.. ఏయూ వీసీ రాజీనామా డిమాండ్ తో రెండో రోజు విద్యార్థులు ఆందోళనకు దిగారు.. ఎగ్జామ్స్, క్లాస్ లు బహిష్కరించారు.. క్యాంపస్ లో ర్యాలీలు నిర్వహించారు.. ఏయూ హాస్టల్‌లో ఓ విద్యార్థి సకాలంలో చికిత్స అందక మృతిచెందిన నేపథ్యంలో.. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే ఆ విద్యార్థి మృతిచెందాడంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు.. తమ సమస్యలు పట్టించుకోని వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన చాంబర్‌లోకి దూసుకువెళ్లారు.…
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నేటి నుంచి హాస్టళ్లు తాత్కాలికంగా మూసివేశారు వర్సిటీ అధికారులు.. భారత్-పాక్ యుద్ధం కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు ముగిసిన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.
ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు పేరుతో మోసాలు పెరుగుతున్నాయి.. ఒక్కో ఉద్యోగానికి లక్షలు డిమాండ్ చేస్తున్నారు కేటుగాళ్ళు... నిందితుల్లో ఏయూ ఉద్యోగులు ఉన్నారు.. ఉద్యోగం రాక మోసపోయి బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాల పేరిట మోసం కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు దర్యాప్తు చెయ్యకుండ.. సమస్య పరిష్కారం జరిగిందని కేసును క్లోజ్ చేస్తున్నారు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. మూడురోజుల క్రితం వెలుగుచూసిన ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్టీవీలో ప్రసారం అయిన కథనాలకు అధికారులు స్పందించి ర్యాగింగ్ చేసిన సీనియర్ విద్యార్ధినులు పది మందిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలని, పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రెండు వర్సిటీలకు వీసీలను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నియామకమయ్యారు. ప్రసాద్ రెడ్డి నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.