Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులు-అధికారులు మధ్య చర్చలు సఫలం అయ్యారు.. దీంతో, నిరసనను విరమించారు ఏయూ విద్యార్థులు.. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ.. జిల్లా అధికారుల బృందం.. దసరా సెలవులులోగా విద్యార్థుల డిమాండ్లను పూర్తి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.. ఇక, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం.. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.. మరోవైపు, ఆంధ్రా యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది మేనేజ్‌మంట్.. రేపటి నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.. యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఒక రోజు ముందే నుండే హాలిడేస్ ప్రకటించారు..
Read Also: Ajit Pawar: నిన్ను సీఎంను చేయమంటావా? వరద మహిళపై అజిత్ పవార్ ఆగ్రహం
కాగా, ఆంధ్రా యూనివర్సిటీ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్ని విషయం విదితమే.. కనీస వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ కల్పించక పోవడం వల్లే BED విద్యార్థి మణికంఠ మృతి చెందాడని తీవ్ర ఆగ్రహ జ్వలలు వెల్లు వెత్తుతున్నాయి.. ఉదయం నుండి కూడా ఏయూ వీసీ ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. స్టూడెంట్ మృతికి బాధ్యత వహిస్తూ వీసి రాజీనామా చేయాలనీ విద్యార్థులంతా డిమాండ్ చేశారు.. పరిస్థితులు చేయి దాటి పోవడంతో భారీగా పోలీసులు మొహరించారు.. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళనలో వెనక్కి తగ్గలేదు.. వీసీ ఛాంబర్ ను ముట్టడించి న్యాయం కోసం డిమాండ్ చేశారు.. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు, అసెంబ్లీలో ఏయూ ఇష్యూపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు.. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ 100 లో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని.. అంతేకానీ వైస్ ఛాన్సలర్ లను ఇబ్బంది పెట్టడం, ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు. అలా కాకుండా రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలకు వెనకడబోమాని హెచ్చరించారు.. ఇక, ఈ పరిణామాల తర్వాత.. విద్యార్థులతో వీసీ, జిల్లా అధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. ఆందోళన విరమించారు విద్యార్థులు..