ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు.
ఈ 40 రోజులు చాలా కీలకమని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ఎన్డీఏ కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ దిశానిర్ధేశం చేశారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచనలు చేశారు.
మార్కాపురం మారుమోగిపోయిందని.. మార్కాపురంలో వచ్చిన స్పందన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జనం నాడి తెలిసిపోయిందని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు.
చంద్రబాబు, బీజేపీ, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల కోసం పేద ప్రజల మీద కక్ష తీసుకునే రాజకీయాలు చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. పెన్షన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ బీనామి సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసి అని ఆయన ఆరోపించారు.
వాలంటీర్ల సేవల గురించి రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ రమేష్, పవన్, చంద్రబాబులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీలో పింఛన్ల పంపిణీపై కొనసాగుతున్న సందిగ్ధతపై ఎట్టకేలకు క్లారిటీ లభించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఉండదని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కింజారపు కళావతమ్మ మృతి చెందారు.
జగన్ ఇంటికి వెళ్లే రోజు దగ్గరకు వచ్చిందని, ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక న్యాయం చేసేది టీడీపీనేనని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.