వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (బుధవారం) 7వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అమ్మవారిపల్లె నుంచి జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారుల తీరుపై ఈసీ కొరడా ఝుళిపించింది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను వెల్లడించింది.
నాల్గో రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నేడు స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా భార్య క్రిస్టియన్ అని గుర్తుచేశారు.. అయితే, నేను ఎన్నికల కోసం చర్చికి రాలేదని స్పష్టం చేశారు. తనను తాను తగ్గించుకునువాడు హెచ్చించును అన్నారు. ఇక, మా కుటుంబంలో సర్వ మతాలను గౌరవించేవారు.. అన్ని మతాలను నేను గౌరవిస్తాను అన్నారు. అంతేకాదు.. జీసస్ నడిచిన బెత్లెహేముకి కూడా నేను వెళ్లానని…