ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. గత వారం రోజుల క్రితం ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులను ఈసీ జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా, ఏపీలో ట్రాన్సఫర్లు అయినా ఐఏఎస్ అధికారులకు పోస్టింగులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు జవహార్ రెడ్డి జీవో జారీ చేశారు.
Read Also: Vikkatakavi: తొలి తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ ‘వికటకవి’ వచ్చేస్తున్నాడు!
కాగా, ఇటీవల ఈసీ వేటుతో బదిలీ అయిన ఐఏఎస్సులకు పోస్టింగులు ఇచ్చింది. వీరికి ఎన్నికలతో సంబంధం లేని శాఖలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓగా లక్ష్మీషా.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు.. టీటీడీ జేఈవోగా గౌతమి.. మిడ్ డే మిల్స్ డైరెక్టరుగా అంబేద్కర్.. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా వెంకట్రామి రెడ్డి.. సీసీఎల్ఏ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.