PM Modi: ఈ రోజు నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నాలుగో దశ పోలింగ్‌కి ముందు ప్రధాని నరేంద్రమోడీ ఓటర్ల సందేశమిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడాని ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని పీఎం మోడీ సోమవారం ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్ సహా అన్ని ప్రాంతాల్లో ఓటేసేందుకు ఓటర్లు రికార్డు సంఖ్యలో పోలింగ్ సెంటర్లకు చేరుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
‘‘ఈరోజు 4వ దశ లోక్‌సభ ఎన్నికలలో, 10 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో మరియు యువ ఓటర్లు కూడా ఓటు వేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మహిళా ఓటర్లు ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. కాబట్టి రండి, మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్ధాం’’ అని ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
‘‘ నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఓటర్లు రికార్డు స్థాయిలో పోలింగ్ బూత్‌లకు చేరుకుని వారసత్వాన్ని గౌరవించే ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నక్సలిజాన్ని రూపుమాపడమే వారి సంకల్పం మరియు భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మీ ప్రతి ఓటు సుస్థిరమైన, దృఢమైన మరియు నిర్ణయాత్మక ప్రభుత్వానికి బలమైన స్తంభంలా పనిచేస్తుంది’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17, ఉత్తరప్రదేశ్ నుంచి 13, మహారాష్ట్ర నుంచి 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిది, బీహార్ నుంచి 5, జార్ఖండ్, ఒడిశా నుంచి నాలుగు, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకటి ఉన్నాయి. ఈ దశ ఎన్నికల్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, బీజేపీ నేతుల గిరిరాజ్ సింగ్ చౌహాన్, శత్రఘ్ను సిన్హా, యూసప్ పఠాన్, వైఎస్ షర్మిలా వంటి ముఖ్య నేతలు పోటీ చేస్తున్నారు.
ఈ రోజు జరిగే నాలుగవ దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి…
— Narendra Modi (@narendramodi) May 13, 2024