ఏపీలో ఎన్నికల సమయంలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలోనే సిట్ అధికారులు మకాం వేసింది. అవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి సిట్ టీమ్ వెళ్లనుంది. జిల్లాల్లో పోలీసులు కేసులు విచారిస్తున్న తీరుపై సిట్ మరో నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉంది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా ఎమ్మెల్యే అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొనింది. సాక్షులను ప్రభావితం చేయకూడదంటూ అభ్యర్థులకు షరతు విధించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి దర్శనానికి ఆగస్టు నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, వసతి గదులు ఆన్లైన కోటా రిలీజ్ కానున్నాయి.
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో వర్శిటి జరిగిన దాడి ఘటనపై విచారణకు హాజరయ్యారు. అక్కడ ఆయన అధికారులతో మాట్లాడారు. "పద్మావతి వర్శిటిలో నాపై దాడికి కర్త, ఖర్మ, క్రియ మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు.
ఏపీలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం బలపడుతోంది.